పాక్‌తో వన్డేలకు భారత జట్టు
ముంబయి, డిసెంబర్ 23 జనంసాక్షి :
భారత్-పాక్‌జట్లు ఆడే వన్డే మ్యాచ్‌ల్లో ఆడే జట్టును ఆదివారంనాడు ఎంపిక చేసింది. సందీప్ పాటిల్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ ఆదివారంనాడు భేటీ అయింది. భారత జట్టును ఎంపిక చేసింది.మహేంద్రసింగ్ ధోని (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంబీర్, విరాట్ కోహ్లి, యువరాజ్‌సింగ్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా, ఆర్.అశ్విన్, ఇషాంత్‌శర్మ, రహానే, అశోక్ దిండా, భువరేశ్వర్‌కుమార్, షమి అహ్మద్, అమిత్ మిశ్రా ఆడనున్నారు. అలాగే టి-20 మ్యాచ్‌లకు కూడా జట్టును ఎంపిక చేశారు. మహేంద్రసింగ్ ధోని (కెప్టెన్), గౌతమ్ గంబీర్, రహానె, యువరాజ్‌సింగ్, రోహిత్‌శర్మ, సురేష్ రైనా, విరాట్‌కోహ్లి, రవీంద్ర జడేజా, ఆర్.అశ్విన్, అశోక్‌దిండా, ఇషాంత్‌శర్మ, భువనేవ్వర్ కుమార్, పర్వీందర్ ఆవానా, పియూష్ చావ్లా, అంబటి రాయుడు ఆడనున్నారు. ఇదిలా ఉండగా డిసెంబరు 25 నుంచి జనవరి 6వ తేదీ వరకు పాక్ జట్టుతో మూడు వన్డేలు, రెండు టి-20లు ఆడనున్న విషయం తెలిసిందే.