పాక్‌లో భారత దైత్యాధికారులకు అవమానం

గురుద్వారాలు సందర్శన సందర్భంగా ఆంక్షలు

మండిపడ్డ భారత్‌..లిఖితపూర్వకంగా నిరసన

న్యూఢిల్లీ,నవంబర్‌23(జ‌నంసాక్షి): పాక్‌లోని సిక్కు యాత్రా స్థలాన్ని సందర్శించడానికి వచ్చిన తమ దౌత్యవేత్తలను అడ్డుకోవడంపై భారత్‌ తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఇది పిలిచి అవమానించడం లాంటిదని పేర్కొంది. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఉన్న గురుద్వారా నంకనా సాహేబ్‌, మరుసటి రోజు గురుద్వారా సచ్చా సౌదాలోకి ప్రవేశించకుండా దౌత్యవేత్తలు అనుమానించడంపై అధికారిక ఫిర్యాదును భారత్‌ నమోదు చేసింది. పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ప్రయాణ అనుమతి ఉన్నప్పటికీ, ఇస్లామాబాద్‌లోని భారతీయ కాన్సులర్‌ అధికారులు వేధింపులకు గురయ్యారు. యాత్రికులను కలవడానికి నిరాకరించారని పేర్కొంది. అలాంటి వేధింపుల ఫలితంగా, వారు తమ దౌత్య, కాన్సులర్‌ విధులు నిర్వహించకుండా ఇస్లామాబాదుకు తిరిగి రావాలని పేర్కొన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. గురునానక్‌ దేవ్‌ 550వ జయంతి సందర్భంగా, భారత సిక్కు యాత్రికుల సందర్శనం కోసం సౌకర్యాలు కల్పించామని, అటువంటి చర్యలకు పాక్‌ పాల్పడదని పేర్కొన్నట్లు ప్రకటనలో పేర్కొంది. దేశ సౌర్వభౌమా ధికారం, ప్రాదేశిక సమగ్రతను అణగదొక్కడమే లక్ష్యంగా, అసహతను ప్రేరేపించడానికి, వేర్పాటు వాద ధోరణులను ప్రోత్సహించే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. సిమ్లా ఒప్పందం, లా¬ర్‌ డిక్లరేషన్‌పై భారత్‌కు వ్యతిరేకంగా వేర్పాటు వాదులకు మద్దతు తెలుపుతుందని, తమపై చేస్తున్న అభాండాలపై పాకిస్తాన్‌ చర్యలను తీసుకోవాలని ప్రకటన పేర్కొంది. భద్రతా కారణాలు చెప్పి ఇలా భారత దౌత్యవేత్తలను అడ్డుకోవడం ఇది మూడవసారని భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 1961లో వియన్నా కన్వెన్షన్‌ డిప్లామెటిక్‌ రిలేషన్స్‌, 1963 నాటి వియన్నా కన్వెన్షన్‌ కౌన్సిలర్‌ రిలేషన్‌ను పాక్‌ ఉల్లంఘించిందని భారత్‌ తన ప్రకటనలో పేర్కొంది.