పారిశుద్ధ్య సేవకుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.

పారిశుద్ధ్య సేవకుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు.
తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి) పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక వహిస్తామని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు పేర్కొన్నారు.శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత హి సేవ క్యాంపెయిన్ లో భాగంగా, తాండూరు పురపాలక సంస్థ పారిశుధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగామున్సిపల్ పారిశుధ్య కార్మికులతో కలసి చెకప్ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ లో నిరంతరం శ్రమిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అన్నారు.కరోనా సమయాల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా సేవలు చేసిన వారిలో పారిశుధ్య కార్మికులు ఉన్నారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటే మన తాండూరు బాగుంటుందని ఉద్దేశంతో హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరిగిదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సంబంధిత అధికారులు పార్సిల్దార్ కార్మికులు తదితరులు ఉన్నారు.