పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయాలి

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (10)జనంసాక్షి న్యూస్
పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలి  తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హుస్నాబాద్ పట్టణం లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భారీ ఎత్తున వజ్రోత్సవాలు జరుపుకోవడం జరిగింది ఈ 75 సంవత్సరాల స్వతంత్ర వజ్రోత్సవాల ను పురస్కరించుకొని నూతనంగా నిర్మాణం చేపడుతున్న టువంటి పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని చెప్పేసి తెలంగాణ అంబేద్కర్ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బడుగు బలహీన అనగారిన వర్గాల యొక్క ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక మైనటువంటి ఒడిదొడుకులను కష్టాలను ఎదుర్కొని యావత్ ప్రపంచమే గర్వించదగ్గ ఎటువంటి భారత రాజ్యాంగాన్ని మన దేశానికి అందించిన అటువంటి గొప్ప మహనీయులు యొక్క పేరును పార్లమెంటు భవనానికి నామకరణం చేయాలని ఈ సందర్భంగా అని చెప్పేసి ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాం పార్లమెంటరీ వ్యవస్థ భారత రాజ్యాంగ యొక్క మూలాల వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేపడుతున్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలన పార్లమెంటరీ నుంచి ఈ దేశానికి అందించబడుతుంది కాబట్టి డెమోక్రసీ ఓటు హక్కు రాజకీయ పరిపాలన స్థితిగతులు పూర్తిస్థాయిలో భారత రాజ్యాంగానికి లోబడి పరిపాలనను కొనసాగిస్తున్నారు కాబట్టి,అట్టి పార్లమెంటరీ భవనానికి నవభారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం,తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడ,చెప్పాల ప్రకాష్ రాష్ట్ర కార్యదర్శి ,కండె సుధాకర్ ,జిల్లా నాయకులు, పొన్నాల,వినోద్ కుమార్,కండే సంజీవ్ తదితరులు పాల్గొనడం జరిగింది
Attachments area