పింకి ‘సామర్థ్యం’ పై సందేహాలు

కోల్‌కతా: నవంబర్‌ 14,(జనంసాక్షి):

డిఎన్‌ఎ పరీక్ష నివేదిక ఆదారంగా మాజీ ఆసియా గేమ్స్‌ బంగారు పతక గ్రహీత పింకీ ప్రమాణిక్‌ పురుషుడని తేలడంతో పోలీసులు ఆమెపై చార్జిషీటు దాఖలు చేయాలని చూస్తున్నారు.కాని మంగళవారం పోలీసుల చర్యను వైద్య నిపుణులను ప్రశ్నించారు. వైద్య నివేదిక ప్రకారం ‘డిజార్డర్‌ ఆఫ్‌ సెక్సువల్‌ డెవలప్‌మెంట్‌’ బాధపడుతోంది.ఇలాటి వ్యాది లక్షణం ఉన్న రోగి ఎవరినైనా పురుషుడు అని చెప్పేందుకు వీలు కాదని ఆ నిపుణులు అంటున్నారు.పురుషునికి ఉండే ఎక్స్‌,వై జన్యువుల కలయిక పింకీలో కనిపించినప్పటికీ అలాటి రోగులు లైంగిక కార్యం నిర్వహించలేరు.

పింకీ పై ఆరోపణలు చేయటం ఆన్యాయమని జెనెటిక్‌ మెడిసిన్‌ (జన్యువైద్యం) నిపుణుడు కౌశిక్‌ మోండాల్‌ చెప్పారు.

ఈ కేసు దర్యాప్తు చేస్తున్న వైద్యబృందంలో ఆయన సభ్యుడు.జన్యువుల కలయిక ప్రకారం పింకీ పురుషడని తేలినప్పటికీ నిజమైన మగవాడని చెప్పేందుకు వీలుకాదన్నారు.ఆమెకు డిఎస్‌డి వ్యాధి లక్షణం ఉందని ఇది ఉన్నవారిని మగవారని చెప్పరాదని మోండాల్‌ అబిప్రాయం వ్యక్తం చేశారు.అసలైన లైంగిక కార్యం వారు నిర్వహించలేరన్నారు. కాని పింకీలో రక్తప్రసరణ బాగనే ఉందని అది అంగస్తంభనకు సరిపోతుందని పోలీసులు చెబుతున్నారు. వైద్యనివేదికలో పింకీ మహిళ కాదని తేలిందని లైంగిక సామర్ధ్యం ఉందని నిర్ధారించారని లైంగిక కార్యం చేయకపోయిన రేప్‌ యత్నం చేయవచ్చని దర్యాప్తు అదికారి ఒకరు చెప్పారు. ఇది కేవలం వైద్య అబిప్రాయమేనని చివరి తీర్పు కాదని పింకీ లాయర్‌ చెప్పారు.