పిల్లలకు రుచికరమైన భోజనం అందించాలి*

 జిల్లా కలెక్టర్ ముష ర్రఫ్
 ఫారుఖీ.
 నిర్మల్ బ్యూరో, జులై27,జనంసాక్షి,,,, పాఠశాలల్లోని పిల్లలందరికీ మంచి రుచికరమైనభోజనంఅందించాలని  జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుకి అన్నారు,  బుధవారం  నర్సాపూర్ మండలం లోని పలు పాఠశాలల తనిఖీలో తనిఖీ చేశారు, జిల్లాలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.  ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడ నీరు నిలవకుండా చూసుకోవాలని తెలియజేశారు.
జిల్లా కలెక్టర్  అదనపు కలెక్టర్  హేమంత్ బోర్కడే, జిల్లా విద్యాశాఖాఅధికారి   డా. ఏ. రవీందర్ రెడ్డి తో కలిసి నర్సాపూర్ మండలంలోని నర్సాపూర్ ఆశ్రమ పాఠశాల మరియు నర్సాపూర్ కేజీబీవీలను సందర్శించి, తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు  గ్రామపంచాయతీ సహకారంతో పరిసరాలను శానిటైజేషన్ చేయించాలన్నారు.  అలాగే ఎక్కడ నీరు నిలవకుండా చూసుకోవాలని, దోమలను పెరుగనీయకుండా కిరోసిన్ లేదా బైటెక్స్ స్ప్రే చేయించాలని తెలియజేశారు. వంట గదులను పరిశీలించి, వంట చేసే ఆవరణ మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వంట సిబ్బంది కూడా శుభ్రతను పాటించాలని, హెడ్ కాప్ ధరించాలని తెలియజేశారు.  గడువు ముగిసిన పదార్థాలను వాడకుండా, తాజా తాజా నాణ్యత గల వస్తువులను మరియు తాజా కూరగాయలను కొని, శుభ్రంగా కడిగి వంటకు ఉపయోగించాలని సూచించారు.  అలాగే వంట కూడా సిలిండర్ పై చేయాలనీ, కట్టెల పొయ్యి ఎట్టి పరిస్థితులలో వాడకూడదని తెలియజేశారు.  వండిన వంటలను పరిశీలించి, రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.  పాఠశాల పరిసరాలలో చెత్తను పాడేయకుండా, విడి విడిగా డబ్బాలలో సేకరించి, గ్రామ పంచాయతి వారిచే తొలగింపజేయాలని, అన్ని పాఠశాలలను శుభ్రంగా ఉండేలా చూడాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఎంపీఓ కి సూచించారు.  విద్యార్థుల యొక్క తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులు కూడా పరిశుభ్రతను పాటించాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలియజేశారు. ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడినట్లయితే, వారిని వెంటనే దగ్గరలో గల PHCలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో వైద్యులు లేదా ఏఎన్ఎం ల ద్వారా వైద్య పరీక్షలు చేయించాలని తెలియజేశారు.  ఈ విషయాలను జిల్లాలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాటించాలని ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్ గౌడ్,  పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Attachments area