పిహెచ్.డి 2022-23కు చెన్నై శివ్ నాడార్ విశ్వవిద్యాలయం ప్రవేశాలు

ఖైరతాబాద్ ;  జూన్ 02 (జనం సాక్షి)  శివ్ నాడార్ ఫౌండేషన్ వారి మూడో విద్యాసంస్థ అయిన శివ్ నాడార్ విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ లో పీహెచ్.డి.లకు ప్రవేశాలను ప్రారంభించింది. ఈ సంవత్సరం విశ్వవిద్యాలయం ఇంగ్లిష్ లో పి.హెచ్.డి.ప్రోగ్రామ్ ప్రవేశపెట్టింది. ఇక్కడ స్కాలర్లు ఇంగ్లిష్ లిటరేచర్ లేదా ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్(ఈఎలీ)లో నైపుణ్యం కలిగి ఉండవచ్చు. విశ్వవిద్యాలయం కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, స్పీచ్ టెక్నాలజీ, డేటా సైన్స్, బయోమెట్రిక్స్, మెర్జర్లు అక్విజిషన్లు, ఇలాంటి అనేక పి.హెచ్.డి ప్రోగ్రాంల కోసం విస్తృత శ్రేణి స్పెషలైజేషన్లు అందిస్తుంది. పరిశోధనా కార్యక్రమాలపై మరిన్ని వివరాలు డబ్ల్యూ డబ్ల్యూ  www.snuchennai.edu.in/research లో లభ్యం అవుతాయన్నారు. చెన్నైలోని శివ్ నాడార్ యూనివర్శిటీలో ఇంగ్లిష్ లిటరేచర్ అండ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్(ఈఎల్ టి)లో పరిశోధన క్రస్ట్ ఏరియాలు విద్యారంగంలో జరుగుతున్న ప్రపంచ మార్పులకు ప్రతిస్పందనగా ఉన్నాయన్నారు. ప్రవేశ ప్రక్రియ, అర్హతా ప్రమాణాలు ఆసక్తిగల రీసెర్చ్ ఔత్సాహికులు తమ దరఖాస్తును 2022 జూన్ 17 ఆన్ లైన్ లో naladmissions.com లో సమర్పించాలి. ప్రవేశాలలో రెండు దశల ఎంపిక ప్రక్రియలుంటాయి. తొలుత రాత పరీక్ష, తర్వాత పార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది.