పీఎన్‌ఎల్‌వీ సీ21 రాకెట్‌ని పరిశీలించిన ప్రధాని

శ్రీహరికోట : భారత అంతరిక్ష కేంద్రం శ్రీహరికోటకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శనివారం సాయంత్రం చేరుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మొదటి ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న పీఎన్‌ఎల్‌వీ సీ21 రాకెట్‌ని పరిశీలించారు.