పీపుల్‌ ఫస్ట్‌ సిటిజన్‌ యాప్‌కు విశేష స్పందన 

విజయవాడ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): తిత్లీ తుపాను బాధితులు సత్వర సాయం పొందేందుకు రూపొందించిన
‘పీపుల్‌ ఫస్ట్‌ సిటిజన్‌ యాప్‌’కు విశేష స్పందన లభిస్తోంది. బాధితులు నష్టానికి సంబంధించిన చిత్రాలు, పూర్తి వివరాలను ఈ యాప్‌కు పంపి సత్వర పరిహారం పొందవచ్చు. ఈ యాప్‌ను ఇంతవరకు 17వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు ఆర్టీజీఎస్‌ అధికారులు వెల్లడించారు. యాప్‌ ద్వారా అందిన సమాచారం ఆధారంగా ఆర్టీజీఎస్‌ తక్షణ చర్యలు తీసుకుంటోంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో పీపుల్‌ ఫస్ట్‌ సిటిజన్‌ యాప్‌ అని టైప్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తిల్లీ తుపానుకు దెబ్బతిన్న పంటలు, ఇళ్లు, ఇతర నష్టానికి సంబంధించిన ఫోటోలను యాప్‌కు పంపాలని నిన్న సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేసిన విషయంతెలిసిందే. నష్టం వాటిల్లిన బాధితుల వివరాలు, వ్యక్తిగత మొబైల్‌ నెంబరు, ఆధార్‌ నంబరును స్పష్టంగా పొందుపరచాలి. యాప్‌కు సంబంధించి ఏమైనా సమస్యలుంటే 1100 కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు సత్వర సాయం కోసం ఈ యాప్‌ను వినియోగించుకోవాలని ఆర్టీజీఎస్‌ అధికారులు కోరారు.