పునరావాస గ్రామాల్లో సౌకర్యాలకు కృషి

ఏలూరు,జనవరి28(జ‌నంసాక్షి): పునరావాస గ్రామాల్లో మౌలికసదుపాయల కల్పనలో అధికారులు నిర్లక్ష్యంవహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ ్గ/చ్చరించారు. పునరావాస గ్రామాల్లో విద్యుత్‌, తాగునీరు, డ్రెయినేజీలు, కాలనీ ఇళ్ల మరమ్మతులపై సంబంధిత అధికారులకు సూచనలిచ్చారు. మొత్తం ఎన్ని కాలనీలు నిర్మించారు. ఎన్ని కాలనీలకు మరమ్మతులు చేయాలనే విషయాలపై హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌కు సూచించారు. కాలనీల లేఅవుట్‌, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పూర్తి సమాచారం పునరావాస గ్రామాల వద్ద బోర్డులు పెట్టాలని హౌసింగ్‌ ఇఇకి సూచించారు. నిర్వాసితులను పునరావాస గ్రామాలకు తరలించినప్పటి నుంచి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని, ఇకముందు ఏ సమస్య గురించి అయినా తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. తాగునీరు, కుండీల్లో చెత్తతొలగింపు, డ్రెయినేజీల విషయంలో ఇఒపిఆర్‌డికి పలు సూచనలిచ్చారు. పునరావాలస గ్రామాల్లో చెత్తను డంపింగ్‌యార్డ్‌కు తరలించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి పైపుల లీకేజీ విషయంలో ఆర్‌డబ్ల్యూయస్‌ ఎఇ తీసుకున్న చర్యల గురించి పూర్తివివరాలను అడిగి తెలుసుకున్నారు. పునరావాలస కాలనీల విషయంలో బాధ్యులైన ప్రతిఅధికారి వద్ద నుంచి వారుచేసిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేవాలయాలు, అంగన్‌వాడీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల భవనాలకు విద్యుత్‌ కనెక్షన్‌లు ఇచ్చిగ్రామ పంచాయతీలకు అప్పగించాలని ట్రాన్స్‌కో ఎఇని ఆదేశించారు. 12 పునరావాస కాలనీల్లో శ్మశానవాటికల లేఅవుట్‌లు, పునరావాలస కాలనీల్లోని కుటుంబాల వివరాల బోర్డులు ఏర్పాటు చేయాని, పైడిపాక పునరావాసగ్రామ పరిధిలోని చంద్రకాలనీకి ఇచ్చిన శ్మశానస్థలం అంత్యక్రియలకు అనువుగా లేనందున పది అడుగుల ఎత్తుమేర ఆ ప్రదేశంలో మట్టిని డంప్‌చేసి ఇస్తే శ్మశానవాటికకు బాగుంటుందని తహశీల్దార్‌కు సూచించారు.