పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్న రూ. 450కోట్ల భవింతి

ముంబయి: ఒకప్పటి వాట్సన్స్‌ హోటెల్‌…. ఇప్పటి ఎస్ల్పనేడ్‌ మ్యాన్షన్‌….. వయసు రెండు వందల ఏళ్లు, ఖరీదు రూ. 450 కోట్ల పైమాటే. దేశంలో ఉన్న ఒకే ఒక్క క్యాస్ట్‌ ఐరన్‌ నిర్మాణం దక్షిణ ముంబయిలో ఉన్న ఈ హెరిటేజ్‌ భవనం. శిథిలావస్థలో ఉన్న ఈ భవనం నివాస యోగ్యం కాదని బీఎంసీ నోటీసులు జారీ చేసింది. దాంతో భవనంలో నివసిస్తున్నవారు, యజమానులు కలిసి భవన పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. అందుకు గాను ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేశారు. ప్రస్తుతం భవన యజమానిగా ఉన్న సాదిక్‌ అలీ  1980లలో టాటాల నుంచీ దీన్ని కొన్నారు. మరో పక్క హెరిటేజ్‌ భవనాల అభిమానులు, వాస్తుశిల్పులూ మాత్రం ఈ చారిత్రక భవనం రూపురేఖలు మార్చకుండా అలాగే ఉంచాలని కోరుతున్నారు.