పులిపిల్లల కళేబరాల గుర్తింపు

పోస్ట్‌ మార్టమ్‌ ద్వారా మరణాన్ని గుర్తించే అవకాశం

భోపాల్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని కన్హా పులుల అభయారణ్యంలో రెండు పులి పిల్లల కళేబరాలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీశాఖ ఉద్యోగులు ముక్కీ అటవీ రేంజిలో పెట్రోలింగ్‌ చేస్తుండగా రెండు నెలల వయసు గల రెండు పులి పిల్లల కళేబరాలు కనిపించాయని అటవీశాఖ అధికారి కృష్ణమూర్తి చెప్పారు. పులి పిల్లల కళేబరాలను పోస్టుమార్టం కోసం తరలించారు. పులిపిల్లలు ఎలా మరణించాయో పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని అటవీశాఖ అధికారులు చెప్పారు. 2014 పులుల గణన ప్రకారం కన్హా పులుల అభయారణ్యంలో వంద పులులున్నాయి.