పులిమామిడి నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

శివ్వంపేట జూలై   జనంసాక్షి :టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, శివ్వంపేట మాజీ సర్పంచ్ పులిమామిడి నవీన్ గుప్తా తల్లి అంజమ్మ అనారోగ్యం గురై ఇటీవల మరణించారు. పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మండలానికి చెందిన పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి  సోమవారం మండల కేంద్రమైన శివ్వంపేట లోని నవీన్ గుప్తా నివాసానికి విచ్చేసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సమయంలో ఎమ్మెల్యే వెంటా జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్, ముఖ్య నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, గొర్రె వెంకట్ రెడ్డి,  కొడకంచి రవీందర్ గౌడ్, కొండల్, లక్ష్మీ నరసయ్య, ఈసారపు శ్రీనివాస్ గౌడ్, వర్రె శ్రీనివాస్ యాదవ్, దర్శన్, నారాయణ పులిమామిడి శ్రీనివాస్ గుప్తా, పులిమామిడి శేఖర్ గుప్తా తదితరులున్నారు.