పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు.
కేసముధ్రం ఆగస్టు 25 జనం సాక్షి / మండలం లోని అయ్యగారిపల్లి గ్రామంలో గురువారం బొడ్రాయి మరియు ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన స్థానిక సర్పంచ్ మామిడి శోభన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్,ఎంపీ మాలోత్ కవిత హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అనంతరం ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉప్పరపల్లి,అర్పనపల్లి, కాట్రపల్లి,లక్ష్మీపురం గ్రామాలలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రమోహన్,జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల నవీన్ రెడ్డి,సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మాదారపు సత్యనారాయణ,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు నజీర్ అహ్మద్, పట్టణ అధ్యక్షులు వీరు నాయక్,ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.