పెట్రోలు ధర పెంపుపై మండిపడ్డ మమత
కోల్‌కతా: పెంచిన పెట్రోలు ధరపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనార్జీ మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. పెట్రోలు ధర పెంపు నిర్ణయాన్ని దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. యూపీ ఏ భాగస్వామ్య పక్షాలథక్ష సంప్రదించకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు. వెంటనే కేంద్రం దీనిపై వెనక్కు తగ్గకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.