పెట్రోల్ పంపులో పనిచేస్తూ…జూనియర్ లైన్ మాన్ ఉద్యోగానికి నర్సిములు.ఎంపిక.

విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి,సీఎండీ ప్రభాకర్ చేతుల మీదగా నియామక పత్రం.
హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు…. అభినందనలు తెలిపిన తోటి మిత్రులు.
తాండూరు అక్టోబర్ 2(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన బుద్దారం రాములు మంగమ్మ దంపతుల పెద్దకుమారుడు నర్సిములుగత కొంతకాలం గా పెట్రోల్ పంపులో పనిచేస్తూ జీవితం కొనసా గించారు. అయితే కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాదించాలని పట్టుపట్టారు. దీంతో అదృష్టం వరించిటి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ డిపార్ట్మెంట్ లో జూనియర్ లైన్ మాన్ గా ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు. శనివారం హైదరాబాద్ లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి,సీఎండీ ప్రభాకర్ చేతుల మీదగా నియామక పత్రాన్ని అందుకు న్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడితే విజయ అవకాశాలు సొంతం అవుతా యని తెలిపారు. సాధించాలి అనే తపన ఉండాలని అప్పుడే విజయ అవకాశాలు చేజిక్కుతాయని తెలిపారు.నర్సిములు కష్టపడి ఉద్యోగం సాధించినందుకు గాను గ్రామపెద్దలు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ తోటి మిత్రులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.