పెద్దపల్లి జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి

మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లాలోని మంథని, రామగిరి, ముత్తారం, కమాన్ పూర్ మండలాలు పాలకుర్తిలోని నాలుగు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ బంధు, మైనార్టీ బందు పథకాలలో అర్హులను అధికారులు ఏ విధంగా గుర్తించడం జరిగిందో పూర్తి వివరాలు తెలుపుతూ జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను మంథని ఎమ్మెల్యే దుదిల్ల శ్రీధర్ బాబు వినతి పత్రం ద్వారా కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, మైనార్టీ బంధు ప్రభుత్వ పథకాలలో అర్హులను అధికారులు గుర్తించి మండల అభివృద్ధి అధికారుల ద్వారా లబ్దిదారులను విచారణ చేసి తుది జాబితా ప్రకారం జిల్లా అధికారులు అర్హులను గుర్తించి వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున, ఈ లబ్దిదారుల జాబితాలో అనర్హులైన వారిని కూడా గుర్తించినట్లు తమ దృష్టికి వచ్చినందున ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బందు, బీసీ బందు, గృహలక్ష్మి, మైనార్టీ బందు ప్రభుత్వ పథకాలలో ఏ విధంగా అధికారులు గుర్తించడం జరిగిందో పూర్తి సమాచారం తెలుపుతూ జిల్లా అధికారులతో వెంటనే ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కోరారు.