పేదల గృహనిర్మాణానికి ప్రాధాన్యం: కోడెల
గుంటూరు,అక్టోబర్26(జనం సాక్షి): వరదలతో రోడ్లు, చెరువులకు కలిగిన నష్టాన్ని వచ్చే వేసవిలో పూడుస్తామని స్పీకర్ కోడెల అన్నారు. ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న పట్టణ, గ్రావిూణ గృహనిర్మాణ పథకాలు పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. దామాషా ప్రకారం గృహనిర్మాణాలకు లబ్ధిదారుల ఎంపిక పక్రియ చేపడతామని తెలిపారు. పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో వ్యవసాయాన్ని గాడిన పెట్టేందుకు పక్కా కార్యచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లు చెప్పారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభాపతిగా తనపై ఉందని, సభ్యుల హక్కులను పరిరక్షించడంతోపాటు తప్పుచేస్తే సరిచేస్తామన్నారు.