పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో అందిస్తున్న విద్యను సద్వినియోగం చేసుకోవాలి:
సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత.
దౌల్తాబాద్, సెప్టెంబర్ 14, జనం సాక్షి.
మహిళలకు భద్రతకు భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం షీ టీిం లను ఏర్పాటు చేసిందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత పేర్కొన్నారు.
దౌల్తాబాద్ మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో విద్యార్థులకు లైంగిక వేదింపుల నిరోధక చట్టాలపై, షీ టీమ్స్ పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సును సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆద్వర్యంలో నిర్వహించారు.విద్యార్థులకు ఏ సమయంలో నైనా ఇబ్బందులకు గురైతే డయాల్ 100,1098 నెంబర్లకు ఫోన్ చేయాలని వారు పేర్కొన్నారు.సోషల్ మీడియా కి ఆకర్షితులై విద్యార్థులు తమ జీవితాలను పాడుచేసుకోవద్దని,తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను నిజం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థినిలు ఎవరైనా ఆకతాయిల వేధింపులతో ఇబ్బందులు తమకి సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో గజ్వెల్ ఏసీపీ రమేష్, షీ టీం జిల్లా ఇంఛారర్జ్ సీఐ దుర్గ,తొగుట సీఐ కమలాకర్,షీటీం ఎస్ఐ శ్రవంతి,దౌల్తాబాద్ ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి, షీటీం ఏఎస్ఐ అమృత్, ప్రిన్సిపాల్ రాజేందర్ ఎస్ఎంసి చైర్మన్ రెడ్డి శ్రీనివాస్, ఉప సర్పంచ్ ముత్యంగారి యాదగిరి, వార్డ్ మెంబర్ మాశెట్టి నరేష్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.
Attachments area