పోటీతత్వం ఉన్నంత కాలం ఎఫ్‌డీఐలను అనుమతించవచ్చు-కలాం
కోల్‌కతా: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) అనుమతించడానికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం మద్దతు పలికారు. అభివృద్ది చెందుతున్న ప్రపంచం అభివృద్ది చెందినది కావాలంటే.. అక్కడ తప్పనిసరిగా పోటీతత్వం, దూసుకుపోయే వాతావరణం ఉండాలని చెప్పారు. మనకు ఇది ఉన్నంత కాలం(పోటితత్వం) చిల్లరవర్తకంలో ఎఫ్‌డీఐ ప్రమాదకరమైనది కాదు అని ఆదివారం ఇక్కడ భారత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన సదస్సులో తెలిపారు.