పోన్నం వ్యాఖ్యలను ఖండించిన శైలజానాథ్
విశాఖ : తెలంగాణ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని తెలంగాణ వాదులు లిఖితపూర్వక హమీ ఇచ్చిన నేపధ్యంలో ప్రభుత్వం అనుమతిచ్చిందని .మంత్రి శైలజానాథ్ పెర్కోన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజాస్వామ్య వైఖరిగా అయన అభివర్ణించారు. ముఖ్యమంత్రిపై ఎంపీ పోన్నం ప్రభాకర్ చేసిన వాఖ్యలను.అయన తీవ్రంగా ఖండించారు. సోనియా అశీస్సులతో రాష్ట్రంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అని… అయనపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఢీల్లీ తామూ వెళ్లోచ్చామని.. తెలంగాణ అంశంపై అక్కడ కదలికలేదని చెప్పారు. సమైక్యాంద్ర ఉద్యమం ఉద్దృతంగా సాగుతోందని.. దాని కోసం ప్రత్యేక ప్రణాళిక రూపోందించాల్సిన అవసరం లేదన్నారు.