పోలవరం నిర్వాసితులకు పునరావాసం ఇవ్వాలి

ఏలూరు,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సమగ్ర పునరావాసాన్ని కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హావిూలను నెరవేర్చకుండా మోసం చేశాయని ఆరోపించారు. మన్యం ప్రాంతంలో 1/70 చట్టాన్ని అధికారులు కచ్చితంగా అమలు చేయాలని కోరారు. మన్యంలో దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని కోరారు.