పోషణ మాసం కార్యక్రమాలు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 13(జనం సాక్షి)
 పోషణ మాసం సందర్భంగా అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని 40, 41  డివిజన్   ఉరుసు రెండు  సుభాష్ నగర్ అంగన్వాడీ కేంద్రంనందు
 ఉర్సు కరీమాబాద్ సెక్టార్    ఐ సి డి ఎస్  వరంగల్ ప్రాజెక్ట్  సూపర్వైజర్  బత్తినిత్తిని రమాదేవి    పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా  బత్తినిరమాదేవి సూపర్వైజర్ మాట్లాడుతూ 1 నుండి 15వ తారీఖు వరకు ప్రతి అంగన్వాడీ టీచర్ వారివారి పరిధిలో 0నుంచి 5 సంవత్సరాల పిల్లలకు  తప్పకుండా బరువు  చూడాలితల్లిదండ్రులకు ఏరియా ప్రజలకు పోషణ మరియు ఆరోగ్యం గురించి వ్యక్తిగత  పరిసరాల పరిశుభ్రత గురించి ప్రతి అంగన్వాడీ టీచర్ అవగాహన కల్పించాలి.
 కార్పొరేటర్ మరుపల్లి రవి  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు అంగన్వాడి కేంద్రం లో ఇచ్చే బాలామృతం  తప్పకుండా తీసుకొని మూడు సంవత్సరాల లోపు పిల్లలకు    తినిపించాలని వారి ఆరోగ్యం పోషణ పట్ల తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
 అనంతరం  గర్భిణి ఆహ్వానము అన్నప్రాసన , అక్షరాభ్యాసం చేయించడం జరిగింది
 ఈ కార్యక్రమానికి  అంగన్వాడి  టీచర్లు సునీత భార్గవి నాగమణి సప్న వెంకట లక్ష్మి విజయలక్ష్మి ఆయాలు తల్లులు  పిల్లలుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Attachments area