ప్రజలకు మేలు చేయని ప్రధాని నిర్ణయాలు

ప్రభుత్వ తీరుపై బిజెపిలో చర్చ సాగాలి
లేకుంటే నష్టపోయేది పార్టీయే తప్ప మరోటి కాదు
న్యూఢిల్లీ,జనవరి5(జ‌నంసాక్షి): ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ విశ్లేషణతో బిజిఎపి విభేదిస్తున్నది. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన సమాధానాలపై ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఆయనతో ఏకీభవిస్తున్న వారు దాదాపుగా ఎవరూ లేరనే చెప్పాలి. కేబినేట్‌లోనూ, పార్టీలోనూ మోడీపట్ల గతంలో ఉన్న విశ్వాసం సన్నిగిల్లుతోంది. ప్రధానంగా రఫేల్‌ విషయంలో శుక్రవరాం నాటి చర్చ తరవాత అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. రాష్టీయ్ర స్వయం సేవక్‌ సంఘ్‌కు సైతం అంతర్గతంగా భిన్నాభిప్రాయంగా ఉందన్నది ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీ వ్యాఖ్యలతో బలపడింది. మూడు కీలక రాష్ట్రాలలో బీజేపీ అధికారాన్ని కోల్పోవడం ఒక పెద్ద పరాజయమని ఆరెస్సెస్‌ భావిస్తోంది. కనుకనే హిందూత్వ భేరీలు మోగిస్తోంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆర్డినెన్స్‌ జారీ చేయాలని సంఘ్‌ పరివార్‌ డిమాండ్‌ చేస్తోంది. తన పాలనలో దేశం సాధించిన ప్రగతిపై ప్రజలకు ఆయన నివేదించ దల్చుకున్న నివేదిక ఎలా ఉంటుందో ఇంకా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు.పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ,  డాక్టర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా, రాఫెల్‌ ఒప్పందం తదితర అంవాలపై మోడీ ఇప్పటికీ స్పస్టత లేకుండా ఉన్నారు. కప్పదాటు వ్యవహారాలు, పార్లమెంట్‌లో నేరుగా సమాధానం ఇవ్వకపోవడం వంటి కారణాలు చూస్తుంటే ప్రజలకు మరింతగా అనుమానాలు బలపడుతున్నాయి. ఆయన
ఏ విషయంలోనూ తప్పు చేసినట్టు అంగీకరించడంలేదు. తమ ప్రభుత్వం ప్రతి రంగంలోనూ సక్రమ, ప్రశస్త నిర్ణయాలు తీసుకుందని ఉద్ఘాటిస్తున్నారు. నిజానికి బిజెపి సిద్దాంతాలకు విరుద్దంగా మోడీ నిర్ణయాలు ఉంటున్నాయి. ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు తనకు అపారంగా ఉన్నాయని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే తీసుకున్న నిర్ణయాలు ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని గమనించడం లేదు. పెద్ద నోట్ల రద్దు మహాతప్పిదం అయితే, జీఎస్టీ పూర్తిగా లొసుగుల మయంగా మారింది. ఎన్నో వ్యాపారాలు కుదేలయ్యాయి. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. జిఎస్టీని హడావుడిగా అమలుపరచడంలో చోటుచేసుకున్న అవకతవకల వల్ల అది వ్యాపారవర్గాల వారిని అనేక అవస్థల పాలు చేసింది. వ్యవసాయరంగంలో అనుసరించిన తప్పుడు విధానాల ఫలితంగా రైతులు ఆందోళను చెందు తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతసేపూ గతంలో కాంగ్రెస్‌ అవినీతి  గురించే మాట్లాడడం అలవాటు చేసుకున్నారు. ఇంకా కాంగ్రెస్‌ను దోషఙగా నిలబెట్టడం ద్వారా తన వైఫల్యాలను ఎంతో కాలం కప్పిపుచ్చుకోలేరన్న విమర్శలు బాహాటంగానే ఉన్నాయి. ప్రజల్లో గూడుకట్టుకున్న నిరాశా నిస్పృహలను తొలగించి వారిలో ఆశాభావాన్ని నింపేందుకుగానీ, సమస్యల ఊబినుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించ డానికి గానీ ఆయన కొత్తగా ప్రతిపాదించినదేవిూ లేదు. ప్రగతి సాధనలో మోదీ పూర్తిగా విఫలమయ్యారు. ఇటీవల శాసనసభా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలోనూ భారతీయ జనతా పార్టీ పరాజయం పాలయి నప్పటికీ దానిని పెద్ద సమస్యగా చూడకుండా లోకల్‌ గవర్నమెంట్ల ఫెయిల్యూర్‌ స్టోరీగా చేసేశారు. తాజాగా రాఫెల్‌పై చర్చ జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రి సభలో లేరు. రక్షణమంత్రి ఎదురుదాడితో కూడిన సమాధానం ఇచ్చారు. ప్రజల వైఖరిని సానుకూలం చేసుకోవాలంటే ప్రభుత్వం ఏదో ఒకటి చేసి తీరాలన్న తపన తప్ప నిజంగానే ప్రజలకు ఏదో చేయాలన్న తపన మాత్రం ప్రభుత్వంలో కానరావడం లేదు. రైతులకు వడ్డీలేని పంట రుణాలు ఇవ్వడం, సన్నకారు చిన్నకారు రైతులకు నగదు బదిలీ చేయడం మొదలైన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోనున్నదని తెలుస్తోంది. రైతుల సంక్షేమానికి ఇలాంటి చర్యలు దోహదపడతాయని రుజువు కాలేదు. గత నాలుగున్నరేళ్లుగా ఏవిూ చేయకుండా ఇప్పుడు ఏదో చేస్తారని నమ్మించడం ద్వారా లాభం లేదని గుర్తుంచుకోవాలి. అలాగే బిజెపి పెద్దలు కూడా మౌనంగా ఉండడం వల్ల లాభం లేదు. అంతర్గతంగా చర్చ చేయకుంటే నష్టపోయేది బిజెపియే.