ప్రజలపై భారం మోపాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది శ్రీఅందుకే సంస్కరణలు చేపట్టాం
సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోతే విదేశీ పెట్టుబడులు రావు
ఎఫ్‌డీఐ, డీజిల్ ధర పెంపును సమర్ధించుకున్న ప్రధాని
జాతినుద్దేశించి ప్రసంగం
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 21 (జనంసాక్షి) : ఆర్థిక సంస్కరణలపై దేశ ప్రజల నుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సామాన్యుడిపై భారం మోపాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదని, ఆర్థిక ప్రగతి కోసం కఠిన నిర్ణయాలు తప్పవని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అనుమతి, డీజిల్ ధర పెంపులనకు కారణాలు ఆయన వివరించారు. తాము ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నదీ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. ప్రపంచం సంక్షోభంలో కూరుకున్న తరుణంలో సంస్కరణలు చేపట్టామని, విదేశీపెట్టుబడుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికే నిర్ణయాలు తీసుకున్నామని, విదేశీపెట్టుబడుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికే నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు. మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులు సమకుర్చుకోవాల్సి వుందని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకోసం ఆర్ధిక సంస్కరణలు, అవసరమని ప్రధాని పేర్కొన్నారు. దాయితీల
భారం ద్రవ్యోల్బణాన్ని పెంచి ఆర్ధికరంగాన్ని సంక్షోభంలోకి నెడుతోందని, రాయితీలకు డబ్బులు చెట్లనుంచీ రాలవని ఆయన వ్యాఖ్యానించారు. ఎఫ్‌డీఐ, డీజిల్ ధర పెంపును ప్రధాని సమర్ధించుకున్నారు. ప్రజలు ఆర్ధిక వ్వవస్థపై నమ్మకాన్ని కోల్పోతున్న తరుణంలో ఈ చర్యలు తీసుకోవాల్సివచ్చిందని, దేశాన్ని ఆర్ధిక సంక్షోభంనుంచి రక్షించాలన్నదే తమ ప్రయత్నమన్నారు. డీజిల్‌పై ప్రభుత్వం భరిస్తున్న రాయితీ రూ. 17 కాగా ప్రభుత్వం పెంచింది. రూ. 5 మాత్రమేనని ప్రధాని పేర్కొన్నారు. విలాసవంతమైన కార్లకు ఉపయోగించే డీజిల్‌పై రాయితీని ప్రభుత్వం భరించడం సరికాదని మన్మోహన్‌సింగ్ అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లకన్నా మన చముదుధరలు తక్కువేసన్నారు. పేదల ప్రయోజనాల దృష్ట్యా కిరోసిన్ ధర పెంచలేదన్నారు. చిల్లరవర్తకంలో ఎఫ్‌డీఐల వల్ల చిరువ్యాపారులు నష్టపోతారనడం సరికాదని ఆయన అభిప్రాయ పడ్డారు. 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నదున ధరలు పెంచక తప్పదన్నారు. అంతర్జాతీయ విసణి ధరల భారాన్ని చాలాకాలంగా ప్రభుత్వమే భరిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.