ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు
హైదరాబాద్,సెప్టెంబర్15(జనంసాక్షి): ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఏ సర్వే చూసినా.. ఎవరి నోట విన్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుందంటున్నారని అన్నారు. శనివారం ఇక్కడ విూడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆరే మళ్లీ సీఎం కావాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు పొత్తులకు వెంపర్లాడుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల కూటమిని ప్రజలు విశ్వసించరని అన్నారు. అభివృద్ధికి, అభివృద్ధి నిరోధక శక్తులకు మధ్య ఎన్నికల పోరు జరుగుతుందని మరో నేత మందా జగన్నాథం అన్నారు. ఒక్క టీఆర్‌ఎస్‌పై పోరాడటానికి విపక్షాలన్నీ కలుస్తున్నాయంటేనే.. వారెంత బలహీనులో తెలుస్తోందన్నారు.