ప్రజల్లో కాంగ్రెస్‌ విశ్వసనీయతను కోల్పోయింది


– భాజపా హయాంలో నక్సలైట్ల ప్రాబల్యం తగ్గింది
– కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
– చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌
రాయ్‌పూర్‌, నవంబర్‌15(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల విశ్వసనీయత సంక్షోభంలో చిక్కుకుందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, విశ్వసనీయత లేకపోవడం వల్లే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం లేదని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా రాజ్‌నాథ్‌ గురువారం ప్రచార సభలు నిర్వహించేందుకు ఛత్తీస్‌గఢ్‌ వచ్చారు. ఈ సందర్‌భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భాజపా హయాంలో రాష్ట్రంలో నక్సలైట్ల ప్రాబల్యం బాగా తగ్గిందని చెప్పుకొచ్చారు. గతంలో దాదాపు 90 జిల్లాలు నక్సలైట్ల ఆధీనంలో ఉండేవని, ఇప్పుడు కేవలం పది నుంచి పదకొండు జిల్లాల్లో వారి ప్రాబల్యం మిగిలిందని అన్నారు. రానున్న మూడు నుంచి ఐదేళ్లలో పూర్తిగా నక్సల్స్‌ను ఏరివేస్తామని హావిూ ఇచ్చారు. నక్సలైట్లు హింసను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. పునరావాసం తదితర సదుపాయాలన్నీ ప్రభుత్వం
కల్పిస్తుందని హావిూ ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, వారి మేనిఫెస్టో అర్థంలేనిదని విమర్శించారు. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ధాన్యం పండించే రైతులకు ఇచ్చే బోనస్‌ ఇవ్వకపోవడంపై విలేకరులు రాజ్‌నాథ్‌ను ప్రశ్నించగా.. ఈఏడాది రైతులకు బోనస్‌ అందుతుందని, భవిష్యత్తులో కొనసాగుతుందని వెల్లడించారు. గతంలో ఇవ్వకపోవడానికి కారణం మాత్రం ఆయన చెప్పలేదు. రాష్ట్రంలో నవంబరు 20న రెండో దశ పోలింగ్‌ జరగనుంది.