ప్రజల ఊపిరే తన శ్వాసగా ఉద్యమించిన ఉత్తముడు పాష – సిపిఐ( ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ నేత సీతారామయ్య

ప్రజల ఊపిరే తన శ్వాసగా ఉద్యమించిన ఉత్తముడు పాష
– సిపిఐ( ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ నేత సీతారామయ్య

టేకులపల్లి, సెప్టెంబర్ 29( జనం సాక్షి ): భారత విప్లవ ఉద్యమంలో ముఖ్యమైన నాయకుడిగా ఎదిగిన కామ్రేడ్ ముక్తార్ పాష ప్రజల ఊపిరే తన శ్వాసగా ఉద్యమాలు చేపట్టిన ఉత్తముడని, ఆదివాసి,గిరిజన,పేద ప్రజలకు ఉత్తమ పుత్రుడని విప్లవోద్యమం కొనసాగుతున్నంత కాలం కామ్రేడ్ పాష చిరస్మరణీయుడుగా ఉంటాడని సిపిఐ (ఎం.ఎల్ ) ఖమ్మం,వరంగల్ జిల్లాల ఏరియా కమిటీ నాయకులు జె.సీతారామయ్య అన్నారు. దోపిడి వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా సాగుతున్న విప్లవోద్యమంలో పాష అందించిన స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.సిపిఐ( ఎం.ఎల్)కమిటీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఎస్.కె. ముఖ్తార్ పాష మూడో వర్ధంతి సభ టేకులపల్లి మండలం బద్దుతండలో శుక్రవారం జరిగింది.ఈ సభకు అఖిల భారత రైతు కూలీ సంఘం(AIKMS)మండల నాయకులు బి.నర్సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సభలో సీతారామయ్య ప్రసంగిస్తూ అటవీ ప్రాంతమైన గుండాలలో జన్మించిన పాష భారత విప్లవ ఉద్యమంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న సిపిఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీకి ఇల్లందు ప్రాంతంలో ఎంతో కీలకమైన నాయకుడిగా సుదీర్ఘకాలం పని చేశాడని,ఆదివాసి గిరిజన,పేదల సమస్యలపై భూస్వాములకు వ్యతిరేకంగా, భూస్వాములకు అండగా ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలను రూపొందించాడని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో రోల్లపాడు ప్రాజెక్టు వద్ద శంకుస్థాపన చేస్తూ ఇల్లందు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని సీతారాం ప్రాజెక్టు నీళ్లతో రైతులకు కన్నీళ్లు తూడుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, ఇల్లందును ఆదివాసి జిల్లాగా ప్రకటించాలని, పోడు భూములకు పట్టాలివ్వాలని,గిరిజనయూనివర్సిటీని ఏర్పాటు చేయాలని,ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించాలని అనేక ఉద్యమాలను పాష నాయ కత