ప్రజల వద్దకు ఆర్టీసీ
-ఆదర్శ జిమాక్స్ కాలనీ వద్ద రిక్వెస్ట్ బస్టాప్ ప్రారంభం
సంగారెడ్డి డిపో మేనేజర్ సత్యనారాయణ
సంగారెడ్డి, అక్టోబర్ 14: ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇందులో భాగంగానే ఆదర్శ జిమాక్స్ కాలనీ వద్ద రిక్వెస్ట్ బస్టాప్ ప్రారంభించామని సంగారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి పరిధిలోని టిఎస్ జిమాక్స్ సొసైటీ, ఆర్టీసీ సంగారెడ్డి డిపో ఆధ్వర్యంలో ఆదర్శ జిమాక్స్ కాలనీ వద్ద రిక్వెస్ట్ బస్టాప్ ను డిపో మేనేజర్ సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం ప్రజల వద్దకు ఆర్టీసీ సదస్సు జరిగింది. ఈ సందర్బంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆదర్శ జిమాక్స్ కాలనీ తోపాటు చుట్టు పక్కల కాలనీ వాసుల సౌకర్యం కోసం ప్రయాణ అవసరాలు తీర్చేందుకు రోడ్డుకు ఇరు ప్రక్కల రిక్వెస్ట్ బస్టాప్ ఏర్పాటు చేశామన్నారు.సంగారెడ్డి వైపు ఆదర్శ కాలనీ వద్ద సంగారెడ్డి, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకోసం, సదశివాపేట, జహీరాబాద్ వెళ్లే ప్రయాణికులకు గోకుల్ గార్డెన్ వైపు రిక్వెస్ట్ బస్టాప్ చేశామని అన్నారు. ఎంతోకాలంగా ఈ సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న వారికి, రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు వలన తమ ప్రయాణ అవసరాలు తీరుతాయని సంతోషం వ్యక్తం చేశారు. టిఎస్ జిమాక్స్ సొసైటీ అధ్యక్షులు, ఆదర్శ జిమాక్స్ కాలనీ వాసులు బి యేసయ్య, ప్రధాన కార్యదర్శి గోవింద్ రెడ్డి, సీనియర్ జిర్నలిస్ట్, టి డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్గోయి ప్రభాకర్, ఎల్డర్స్ కమిటీ సభ్యులు అంజయ్య,
సొసైటీ డైరెక్టర్స్ సతీష్ తివారి, నారాయణ, శ్రీకాంత్, షకీల్, భాగ్యలక్ష్మి, పూలమ్మ, కాలనీ వాసులు గ్లోరీ ఫ్లోరెన్స్, శివకుమార్, పెంటయ్య, కుమార్, కాలనీ వాసులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.