ప్రజాసమస్యలపై నిలదీస్తాం: సిపిఐ

ఆదిలాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి) : ప్రజాసమమస్యలపై సిపిఐ నిరంతరంగా పోరాడుతుందని సిపిఐ

నాయకుడు,మాజీ ఎమ్మెల్యే గుండా మళ్లేశం అన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంకోట్లు దోచుకుంటోందన్నారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణాను కుటుంబ తెలంగాణాగా మారుస్తున్నాడన్నారు. కమ్యూనిస్టుల పోరాటాలతోనే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మతోన్మాద శక్తులు వేగం పుంజుకుంటున్నాయని, కార్పొరేట్‌ శక్తులు ప్రభుత్వాలను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.స్వచ్ఛభారత్‌,నల్లధనం అంటూ అధికారాన్ని చేజిక్కించుకున్న ప్రధాని మోదీ.. వాటి విషయంలో పురోగతి సాధించలేక పోయారన్నారు. నల్లధనాన్ని వెనక్కు రప్పించి పేదల ఖాతాల్లో వేస్తానని చెప్పి.. నేడు రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు. ఆర్థిక మాంద్యం వెన్నాడుతున్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, రానున్న రోజులలో మోదీ దోషిగా ప్రజల ముందు నిలబడక తప్పదని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతున్నారన్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ నిర్భంధం పెరుగుతోందని ఆయన దుయ్యబట్టారు.

తాజావార్తలు