ప్రజా సంగ్రామ యాత్ర సభకు బయలుదేరిన బిజెపి నాయకులు
సికింద్రాబాద్ (జనం సాక్షి ) : ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత చివరి రోజు వరంగల్ భారీ బహిరంగ సభకు సీతాఫలమండి మధుర నగర్ కాలనీ నుండి బయలుదేరిన సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, కీర్తి హర్ష కిరణ్ , హనుమంతు దత్తు వనమాల , శ్రీనివాస్ కిరణ్ , లడ్డు సీనియర్ నాయకులు కార్యకర్తలు. మేకల సారంగా పాణి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రాబోయే రోజుల్లో ప్రజలు గట్టి గుణపాతం చెప్తారని హెచ్చరించాడు. వచ్చే ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు .