ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను స్మృతి దహనంప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను స్మృతి దహనం
రఘునాథ పాలెం ఫిబ్రవరి 15 (జనం సాక్షి) ఖమ్మం అంబేద్కర్ సెంటర్ నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను స్మృతి దహన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కులవ్యవస్థకు అంటరానితనానికి అమానవీయ చరిత్రకు కారణమైన మనుస్మృతి ని రాజకీయ పార్టీలు సామాజిక కుల అంబేద్కర్ ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి మంటల్లో వేసి కాల్చడం జరిగింది ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మనిషి జన్మని అవమానపరిచి మానవ అసమానతులకు బానిసత్వానికి దోపిడీకి కారణమైన అధర్మ మను స్మృతి ని పునరుద్ధరించడానికి జరిగే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలని అతనిపై రాజ ద్రోహం కేసు పిడి యాక్ట్ నమోదు చేయాలని హమార ప్రసాద్ కు జీవిత ఖైదు విధించించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్పర్శ సామాజిక అధ్యయన వేదిక కాకి భాస్కర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం లింగాల రవికుమార్,సిపిఐఎంఎల్ ప్రజా పందా గోకినపల్లి వెంకటేశ్వరరావు,ఆవుల అశోక్ బహుజన కమ్యూనిస్టు పార్టీ పొడగంటి రాంబాబు గోపే వినయ్ కుమార్ కర్నే రామారావు బీఎస్పీ నాయకులు శ్రీనివాస్ బీసీ నాయకులు లిక్కి కృష్ణారావు మేకల సుగుణ రావు,డాక్టర్ బాబు రత్నాకర్ లంబాడి హక్కుల పోరాట సమితి బానోత్ కిషన్ నాయక్ కెవిపిఎస్ నందిపాటి మనోహర్ టి ఎమ్మార్పీఎస్ పేర్ల మధు మాదిగ హక్కుల దండోరా కొరిపల్లి శ్రీనివాస్ యూనిట్ ఆఫ్ మాల నాయకులు గుమ్మడి కనకరాజు,జి.ఎల్లయ్య సిహెచ్ కనకయ్య,పిడిఎస్ యు నేత నామాల ఆజాద్, బిఎస్పీ మిరియాల నాగరాజు,అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం తప్పెట భాస్కర్,పిఓడబ్ల్యు ఝాన్సీ, ఉప్పలమ్మ పివైఎల్ రామయ్య పుల్లయ్య,ఎం రమేష్,విద్యార్థి నాయకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు