ప్రణబ్‌కు మద్దతు పలికిన తృణమూల్‌

పార్టీలో ఒత్తిడికి తలొగ్గన దీదీ
న్యూఢిల్లీ,జూలై17: ఎట్ట కేలకు మమతాబెనర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీకి ఓటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఆమె తమ పార్టీ నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రలతి అభ్యర్థిగా ప్రణబ్‌ముఖర్జీకే మద్దతిస్తుందని తెలిపారు. ప్రణబ్‌ముఖర్జీ అఢ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మమత మరో మార్గం లేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రణబ్‌కే మద్దతివ్వాలని నిర్ణయించారు. ముందుగా మద్దతు ఇచ్చేది లేదని ఢీఅష్మించుకున్నా. అబ్దుల్‌ కలాం రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ కోరుకున్నా ఆయన నిరాకరించారు. దీంతో కాంగ్రెస్‌ పై కోపంతో ప్రణబ్‌కు మద్దతు విషయంలో ఎటూ తెత్చలేకపోయింది. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించడానికి మమతాబనర్జీ అధ్యక్షతన తృణమూల్‌ పార్టీ మంగళవారం కోల్‌కత్తాలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. దీంతో యూపీఏలోని కీలక భాగస్వామ్య పక్ష మైన తృణమూల్‌ కాంగ్రెస్‌. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తుందన్న ఏహగానాలకు తెరపడింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలను రూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించినా చివరకు ప్రణబ్‌కు మద్దతు ఇవ్వాలని పార్టీలో వచ్చిన ఒత్తిడికి ఆమె తలొగ్గినట్లు తెలుస్తోంది. ఈనె 19న జరిగే రష్ట్రపతి, ఆగస్టు 7న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్కికు దూరంగా ఉండనున్నట్లు తృణమూల్‌ ముండుగా ప్రకటించింది. తమ అభ్యర్థులకు మద్దతివ్వాలని అటు యూపీఏ, ఇటు ఎన్డీయే తృణమూల్‌ చీఫ్‌ మమతబెనర్జీకి విజ్ఞప్తి చేశాయి. అయితే, ఎవరికి మద్దతివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. యూపీఏ రాష్ట్రతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని మమత తొలినుంచి వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రపతిగా మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాంను, ఉప రాష్ట్రపతిగా మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీని నిలబెట్టాలని ఆమె భావించారు. కానీ, వారిద్దరు పోటీ చేసేందుకు నిరాకరించడంతో. ఎన్నికలకు దూరంగా ఉండాలని దీదీ నిర్ణయించిరు. ప్రణబ్‌కు మద్దతిచ్చేందుకు తొలి నుంచి వ్యతిరేకతతో ఉన్న మమత. ఎన్డీయే బలపరుస్తున్న పీఏ సంగ్మాకు కూడా మద్దతివ్వడానికి నరాకరించారు. అటు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ యూపీఏ, ఎన్డీయే ప్రతిపాదించిన అభ్యర్థులకు దూరంగా ఉండాలని తృణమూల్‌ నిర్ణయం తీసుకుంటుందని అనుకున్నా చివరకు ప్రణబ్‌కు ఓటేయాలని నిర్ణయించారు. దీంతో సందిగ్ధానికి తెరపడింది.