ప్రణబ్‌ను అభినందించిన సోనియా, మన్మోహన్
న్యూఢిల్లీ, జూలై 22 (జనంసాక్షి):
రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ఓట్ల విలువ 5,18,000 కాగా ఇప్పటి వరకూ జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రణబ్‌కు 5,80,000పై చిలుకు ఓట్లు లభించాయి. ఏన్డీఏ అభ్యర్థి పి.ఎ సంగ్మాకు 2,39,000 పైచిలుకు ఓట్లు లభించాయి. ఇంకా 13 రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. సంగ్మా సొంత రాష్ట్రంలోనూ ప్రణబ్ మెజారిటీ లభించింది. మేఘాలయలో ప్రణబ్‌కు 34, సంగ్మాకు 23ఓట్లు వచ్చాయి. భారతదేశ 14వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలో ఘన విజయం సాధించిన ప్రణబ్‌ముఖర్జీకి అభినందనలు తెలిపానని సంగ్మా అన్నారు. ఆదివారంనాడు సాయంత్రం ఓట్ల లెక్కింపులో మ్యాజిక్ ఫిగర్ దాటిన తరువాత ప్రణబ్‌కు సంగ్మా శుభాభివందనలు
ఫిగర్ దాటిన తరువాత ప్రణబ్‌కు సంగ్మా శుభాభివందనలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనను బలపరిచిన బిజెపి అగ్రనేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. అలాగే తన గెలుపునకు కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. తనకు ఇదొక గొప్ప అనుభవమని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికపై ఎల్లుండి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో తనకు ఓట్లు తగ్గడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రణబ్ గెలుపునకు యుపిఎ సర్వశక్తులు ఒడ్డి పోరాడిందన్నారు. బెదిరించి, ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించి ప్రణబ్ గెలుపునకు తన వంతు పాత్ర పోషించిందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా సంగ్మా సొంత రాష్ట్రమైన మేఘాలయలో ప్రణబ్‌కు 34 ఓట్లు రాగా సంగ్మాకు 23 ఓట్లు వచ్చాయి.