ప్రణయ్ పరువు హత్యపై స్పందించిన కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రణయ్ కుటుంబ సభ్యులకు, అతని భార్య అమృతకు సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ‘ప్రణయ్ దారుణ హత్య తీవ్రమైన షాక్‌కు గురి చేసింది. సమాజంలో కులతత్వం ఇంత బలంగా నాటుకుపోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్షపడుతోంది. బాధిత కుటంబానికి న్యాయం లభిస్తోంది. ప్రణయ్ భార్య అమృత గారికి, అతని తల్లితండ్రులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంగా ప్రణయ్ అనే వ్యక్తి మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇక ప్రధాన నిందితుడు మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌లతో పాటు సుఫారీ కిల్లర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.