ప్రణయ్‌ హత్యకేసులో కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌

సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో మిర్యాలగూడ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీంను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్‌ నేత కరీం సహా ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

అమృత తండ్రి మారుతీరావు, అతడి తమ్ముడు శ్రావణ్‌కుమార్‌, మిర్యాలగూడ టౌన్ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీంతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రణయ్‌ ను హత్య చేసిన నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుమార్తె అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతోనే ప్రణయ్‌ ను…..అమృత తండ్రి మారుతీరావు హత్య చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాంగ్రెస్‌ నేత కరీం విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రణయ్‌ని హత్య చేసేందుకు మారుతీరావు రూ.10లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.