ప్రతాప్ రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు

-గజ్వేల్ ఎఎంసి డైరెక్టర్ బాలకిషన్, ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్
జగదేవ్ పూర్ ,జులై 28 జనం సాక్షి
టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ కొంతమంది నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు  రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏఎంసి డైరెక్టర్ చల్లా బాలకిషన్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, జగదేవ్ పూర్ పీఏసీఏస్ డైరెక్టర్ గుర్రం శ్రీనివాస్, టిఆర్ఎస్ మునిగడప  గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం సుధాకర్ లు పేర్కొన్నారు. గురువారం జగదేవ్ పూర్ మండల పరిధిలోని మునిగడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గజ్వేల్  ప్రాంత ప్రజలకు  ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, పదవులు ఉన్న లేకున్నా నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి ప్రతాప్ రెడ్డి అని కొనియాడారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకే ప్రతాప్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా కొంతమంది నాయకులు నామినేటెడ్ పదవులను ఉద్యమకారులకు రాకుండా ప్రతాప్ రెడ్డి అడ్డు తగులుతున్నారని ఆరోపించడం  తగదన్నారు. పార్టీ పటిష్టతకు పని చేస్తున్న నాయకులను, ఉద్యమకారులను గుర్తించి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు నామినేటెడ్ పదవులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాదులో నివాసముంటూ పదవులు కావాలని కొట్లాడేవారికి కాకుండా గ్రామంలోనే ఉండి పార్టీ పటిష్టతకు,ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులకు మాత్రమే టిఆర్ఎస్ పార్టీలో అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అనవసరంగా  ప్రతాప్ రెడ్డి పై అర్ధంపర్థం లేని ఆరోపణలు చేస్తే ఎంతటి వారినైనా సహించేది వారు మండిపడ్డారు. కార్యక్రమంలో కొండపోచమ్మ మాజీ చైర్మన్ జితేందర్ రెడ్డి, కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ పబ్బ హరిగౌడ్,  భాను, బిఎన్ఆర్ కేస్ జిల్లా అధ్యక్షుడు నర్ర బిక్షపతి, అయిలయ్య గౌడ్, రాములు, ఐలయ్య తదితరులు  పాల్గొన్నారు.