ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధికి సహకరించాలి

అంగడి బజారు రోడ్డు యధావిధిగా కొనసాగుతుంది
మీడియా సమావేశంలో తెరాస నేతలు
చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 10 : ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే పట్టణ అభివృద్ధికి సహకరించాలని, రోడ్డు యధావిధిగా కొనసాగుతుందని ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ పూర్మ వెంకటరెడ్డి, కొమురవెల్లి దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ ముస్త్యాల కిష్టయ్య లు సూచించారు. చేర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. పట్టణంలోని అంగడి బజార్, అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డు విషయంలో ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికి కోసం, రాజకీయ లబ్ధి కోసం రోడ్డును మూసివేసి విగ్రహాన్ని తొలగిస్తున్నారని ప్రజల్లో తప్పుడు సమాచారం ఇస్తూ సమావేశాలు పెట్టడం మానుకోవాలన్నారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్వయంగా పత్రిక ప్రకటన ద్వారా అంగడి రోడ్డు,అంబెడ్కర్ విగ్రహం యధావిధిగా ఉంటాయని తెలిపినప్పటికీ టిఆర్ఎస్ పార్టీని ప్రజలలో బదనాం చేయడానికి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. చేర్యాల పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చొరవ తీసుకుని కోట్ల రూపాయలను వెచ్చించి మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారంతో మంజూరు చేయించి పట్టణంలోని వార్డుల అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం 12 కోట్ల రూపాయలను అన్ని  వార్డుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, దానితో పాటు ఎస్సీ సబ్ ప్లాన్ కింద వచ్చిన గ్రాంటును కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న 2,11వ వార్డులకు కేటాయించడం  జరిగిందన్నారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ భవన నిర్మాణంలో  మున్సిపాలిటీ తీర్మానం చేసిన సమావేశంలో సంతకాలు చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా  ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. వారికి పట్టణ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సహకరించాలని ఓర్వలేక ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలే బుద్ధి చెపుతారన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల కోఆర్డినేటర్ తాడెం రంజిత-కృష్ణమూర్తి, టిఆర్ఎస్ యూత్ నాలుగు మండలాల అధ్యక్షుడు శివగారి అంజయ్య, పట్టణ సహాయ కార్యదర్శి బురగోని తిరుపతి గౌడ్, కొమురవెల్లి మల్లన్న ఆలయ డైరెక్టర్ కందుకూరి సిద్ధి లింగం గుప్తా, యూత్ అధ్యక్షుడు యాట బిక్షపతి, చింతల పరుశరాములు, బిరెడ్డి ఇన్నారెడ్డి, రామగల బాబు, బాలరాజు, సదానందం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.