ప్రతిభాభారతికి గుండెపోటు
విశాఖపట్టణం,అక్టోబర్26(జనం సాక్షి): ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్సీ ప్రతిభా భారతికి గుండెపోటు వచ్చింది. విశాఖలోని పినాకిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రతిభా భారతి తండ్రి జస్టిస్ పున్నయ్య(92) అస్వస్థతకు గురవడంతో విశాఖ పినాకిని ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. తండ్రిని చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన సమయంలోనే ప్రతిభాభారతికి గుండెపోటు వచ్చింది. దాంతో వైద్యులు ఆమెకు చికిత్స అందజేస్తున్నారు.