ప్రత్యేక హోదా ఉంటే లక్షల ఉద్యోగాలు వచ్చేవి

విభజనతో జరిగిన నష్టాన్ని హోదామాత్రమే పూడ్చగలదు

కడప,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ సాక్షిగా హావిూయిచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ పాటికే చాలా మార్పులను చూసి ఉండేవాళ్లం. లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఈ మూడున్నరేళ్లలో ఎన్నో పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు కట్టేవాళ్లు, చదువుకునే యువతకు భరోసా
వచ్చేది… కానీ అధికారంలో ఉన్నవారు మోసం చేయడంతో ఆ పరిస్థితిని మనం చూడలేక పోతున్నామని అఖిలపక్షనేతలు అభిప్రాయపడ్డారు. కడప ఉక్కు కోసంఎంతగానో పోరాడినా దానిని సాధించకుండానే

పోయామని అన్నారు. గతంలో ఎన్నో పోరాటాలు చేసినా కలసి రాకపోవడం, అధికార పార్టీ కలవక పోవడం వల్ల కేంద్రం అలుసుగా తీసుకుందన్నారు. విభజనతో జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదాతో మాత్రమే పూడ్చగలమని డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాద్యక్షుడు చిన్ని అన్నారు. ఇకపోతే ప్రత్యేక హోదాకోసం యువత
కలిసిరావాలని, నిరంతరాయంగా ప్రత్యేక ¬దా వచ్చేవరకు పోరాటాలు కొనసాగించాలన్నారు. విభజనతో జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదా మాత్రమే పూడ్చగలదు. అందుకే మన హక్కును సాధించుకోవడానికి నిరంతరాయంగా, ఐక్యంగా పోరాడుదామని అన్నారు. గత మూడున్నర సంవత్సరాలుగా అందరం
కలిసికట్టుగా పోరాడం. ప్రత్యేక హోదా కోసం ఇక్కడికొస్తే కేసులు పెడతామని విద్యార్థులను బెదిరించారు. చట్టసభలైన పార్లమెంట్‌, అసెంబ్లీల్లోనూ ప్రత్యేకహోదా అంశంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు గట్టిగా పోరాటం చేశారు. ఇవన్నీ చేసినా పాలకులు హోదా ఇచ్చారా?..అంటే లేదని అన్నారు.