ప్రధాని పర్యటించాలి: వెంకయ్యనాయుడు

నెల్లూరు: నీలం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తక్షణం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పర్యటించాలని భాజపా జాతీయ నాయకుడు ఎం .వెంకయ్య నాయుడు డిమాండ్‌ చేశారు. ఆయన మంగళవారం నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు తమ సొంత పనులను ఆపి, నీలం తుపానుపై తక్షణ  చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదేవిధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈసారైనా రోడ్డుమార్గంలో స్వయంగా వచ్చి తుపాను పరిస్థితులను పరిశీలించాలని ఆయన ఎద్దేవా చేశారు. వాతావరణ శాఖ తీరుపై తక్షణం కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. హుడా కమిటీ సిఫార్సుల ప్రకారం నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ.10,000 చొప్పున రైతుకు చెల్లించాలని ఆయన కోరారు. నెల్లూరు జిల్లాలో బుధవారం నుంచి పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పర్యటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.