ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బిజెపి


పారదర్శకంగా పార్టీ సభ్యత్వ నమోదు
బిజెపిని దెబ్బతీసేందుకు దుష్పచ్రారం
బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి
రాజమండ్రి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  అత్యధికంగా సభ్యత్వం కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద పారట్‌ఈగా బిజెపి ప్రజల్లో మన్ననలు పొందిందని బీజేపీ అధ్యక్షురాలు,రాజమండ్రి ఎంపీ పురందరేశ్వరి అన్నారు. బీజేపీ తెలుగు రాష్టాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఎంపీ పురందరేశ్వరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురందరేశ్వరి మాట్లాడుతూ.. 2014లో నిర్వహించిన సభ్యత్వ నమోదు ఆన్‌ లైన్‌లో మొదటిసారిగా ప్రవేశపెట్టామన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్దాంతాలు, బీజేపీ దేశానికి సేవ చేసే అంశాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అప్పట్లో ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరిగిందన్నారు. చైనాకు సంబంధించిన కమ్యూనిస్టు పార్టీ ప్రపంచంలోనే తొమ్మిది కోట్ల మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా అవతరించిందని పురందేశ్వరి పేర్కొన్నారు. 2014 లో భారతీయ జనతా పార్టీ 11 కోట్ల మంది కొత్త సభ్యులు నమోదు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని పురందేశ్వరి తెలిపారు. ఎలాంటి అవినీతి మరకలేకుండా ప్రజాహితంగా తమ పార్టీ పని చేస్తోందన్నారు. భారత దేశంలో ఈ రోజుకి సభ్యుల సంఖ్య 18 కోట్ల వరకూ ఉందని పురందేశ్వరి తెలిపారు. 1980 వ సంవత్సరంలో ఇద్దరు పార్లమెంట్‌ సభ్యులతో మొదలైన బీజేపీ ప్రస్థానం, నేడు 240 మందీ పార్లమెంట్‌ సభ్యులను గెలిపించుకునే స్థాయికి వెళ్లిందని పురందేశ్వరి పేర్కొన్నారు. ఇండియా ప్రతిపక్ష కూటమి దుష్పచ్రారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొస్తే సంపూర్ణంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని దుష్పచ్రారం చేశారని పురందేశ్వరి పేర్కొన్నారు. చర్చిల్ని, మసీదుల్ని కూల్చేస్తారని రిజర్వేషన్లు తీసివేస్తారని కావాలని దుష్పచ్రారం చేశారన్నారు. అందువల్లనే ఎన్నికల్లో సీట్లు తగ్గాయన్నారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని పురందేశ్వరి స్పష్టం చేశారు. రాజ్యాంగానికి కట్టుబడి పని చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని పేర్కొన్నారు.