ప్రపంచానికి చాటే స్మారకం నిర్మిస్తాం

– సినారె భావితరాలకు అందిస్తాం

– పార్థీవ దేహం వద్ద సీఎం ఘననివాళి

హైదరాబాద్‌,జూన్‌ 13(జనంసాక్షి): సినారె జ్ఞాపకలు పదిలంగా ఉండేలా అనేక చర్యలు తీసుకుంటామని సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. ఆయన కోసం ఏం చేస్తే బాగుంటుందన్నది ఇతరులు ఇచ్చరే సమాలను కూడా స్వీకరించి అమలు చేస్తామని అన్నారు. గుండెపోటుతో సోమవారం ఉదయం కన్నుమూసిన జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. మంగళవారం మధ్యాహ్నం సినారె ఇంటికి చేరుకున్న కేసీఆర్‌ ఆయన పార్థివదేహానికి పుష్ఫాంజలి ఘటించారు. అనంతరం సినారె గదిని పరిశీలించారు. కేసీఆర్‌ వెంట ¬ంమంత్రి నాయిని,మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌,సాహిత్య అకాడవిూ ఛైర్మన్‌ నదిందిన సిద్దారెడ్డి, మామిడి హరికృష్ణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. కవులకు గ్లామర్‌ తెచ్చిన మహానుభావుడు సినారె అన్నారు. సినారె అందరి కవుల్లాంటి వారు కాదన్నారు. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి కనుకనే అందరికి ఆరాధ్యుడయ్యాడని అన్నారు. తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే వ్యక్తి సినా అంటూ ఆది, అంత్య ప్రాసలకు అద్భుతమైన నడక నేర్పిన మహాకవి అన్నారు. మహాకవి, గొప్ప సాహితీవేత్త డాక్టర్‌ సి. నారాయణరెడ్డి విగ్రహన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ట్యాంక్‌బండ్‌తో పాటు పూర్వపు కరీంనగర్‌ జిల్లా, సిరిసిల్ల, హనుమాజీపేటలో సినారె కాంస్య విగ్రహాలు నెలకొల్పుతామని చెప్పారు. నగరం నడిబొడ్డున సినారె స్మారక మ్యూజియం, సాహితీ సమావేశ మందిరం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలోని ఓ ప్రముఖ సంస్థకు లేదా ఓ యూనివర్సిటీకి సినారె పేరు పెడుతామని చెప్పారు. సినారె విశిష్టమైన సాహితీవేత్త అని తెలిపారు. సాహితీ మకుటంలో సినారె కలికితురాయి అని పేర్కొన్నారు. సినారె అంటే ఒక గ్లామర్‌ అని పేర్కొన్నారు. కవులకు గ్లామర్‌ ఉంటుందని నిరూపించిన వ్యక్తి సినారె అని అన్నారు. తెలుగు ప్రజలు గొప్పగా చెప్పుకునే వ్యక్తి సినారె.. ఆయన సేవలు చిరస్థాయిలో గుర్తుండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంత కీర్తించుకున్నా, పొగిడినా ఆయన సేవలు మరువలేనివి అని స్పష్టం చేశారు. సినారె అభిమానించిన సారసత్వ పరిషత్‌కు ప్రభుత్వం అండదండలు అందిస్తుందన్నారు.వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానన్నారు. సాహిత్య రంగానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి. సినారె అంత్యక్రియల్లో కవులు, కళాకారులు, రచయితలు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేవారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. సినారె సభ్యులకు దైర్యాన్ని, ఆత్మైస్థెర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.సినారె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చేవారి కోసం జిల్లా కేంద్రాల నుంచి 100 బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్‌లో స్థలం కేటాయించి సినారె పేరిట స్మారక భవనం, సమావేశ మందిరం ఏర్పాటు చేస్తామన్నారు. ఇది సాహిత్య గోష్టులకు, చర్చలకు అనుగుణంగా ఉండేలా చేస్తామని అన్నారు. తెలంగాణలోని ఓ సంస్థకు సినారె పేరు పెడతాం. ట్యాంక్‌బండ్‌తో పాటు సిరిసిల్ల జిల్లా కేంద్రం, ఆయన స్వగ్రామంలో కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తాం అని కెసిఆర్‌ పేర్కొన్నారు.