ప్రభుత్వం కల్పించే అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు
సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 12( జనం సాక్షి )రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు బుధ వారం సిద్దిపేట పట్టణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న స్కూల్ యూనిఫామ్ దుస్తులను మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు చేతుల మీదగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని విద్యార్థి దశ మళ్లీ తిరిగి రానిది అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలకు,తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.పేద విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్యను అందిస్తుందని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ద్యేయం అని ఈ సందర్భంగా తెలియజేసారు.విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న బోజనం,యూనిఫామ్స్,పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందిస్తు విద్యార్థులను విద్యలో, క్రీడలో ప్రోత్సహిస్తుందని అన్నారు.బాగా చదివి ఉన్నత స్థానాలలో స్థిరపడలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం పాఠశాల పరిసరాలను మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు కలియతిరుగుతు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్,టీఆరెస్ నాయకులు పయ్యావుల ఎల్లం, పాఠశాల ఉపాధ్యాయ బృందం వారు పాల్గొన్నారు.