ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు -సిపిఎం జిల్లా నాయకులు రేపాకుల శ్రీనివాస్

ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు -సిపిఎం జిల్లా నాయకులు రేపాకుల శ్రీనివాస్

టేకులపల్లి, సెప్టెంబర్ 30( జనం సాక్షి ): అంగన్వాడీ,ఆశ, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలంగాణా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఎం జిల్లా నాయకులు రేపాకుల శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె శిబిరాలను ఆయన సందర్శించి వారి సమ్మె కు సంఘీభావం, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మె కార్మికుల ప్రాథమిక హక్కు అన్నారు. సమ్మె చేయాల్సి వచ్చిందంటే ఆ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని అన్నారు. కనీస వేతనం, పర్మినెంట్ చేయాలని అడగడం గొంతెమ్మ కోరిక కాదని అన్నారు. ఎన్నాళ్ళు ఈ వెట్టి చాకిరీ చేయించుకుంటారని విమర్శించారు. డిల్లీలో రైతులు చేసిన పోరాట స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘాల నాయకులు కడుదుల వీరన్న,ఈసం నర్సింహారావు, కొండపల్లి శకుంతల, కె.రాజేశ్వరి, పి.రాజేశ్వరి, ఐ,రాధ,వై. ఇందిర,వై.పద్మ, సంధ్యారాణి, ఎన్.విజయలక్ష్మి, ఈసం రాణి,సోన నాగలక్ష్మి, భద్రమ్మ, పూనెం హైమావతి,మజహరి,మంగతాయి, తదితరులు పాల్గొన్నారు.