ప్రభుత్వం రైతుల పట్ల వివక్షత తగదు : మొగుడంపల్లి ఆశప్ప

జహీరాబాద్ జులై 17 (జనంసాక్షి)
ప్రభుత్వం రైతుల పట్ల వివక్షత తగదు అని మొగుడంపల్లి ఆశప్ప అన్నారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలో
నిమ్జ్ రైతులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మొగడంపల్లి ఆశప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ప్రాజెక్టు పేరు చెప్పి రైతులకు భయభ్రాంతులకు గురిచేసి న్యాల్కల్ మరియు ఝరా
సంగం మండలాలలో కేవలం 27 శాతం మాత్రమే వ్యవసాయ భూమి ఉంది 73% వ్యవసాయానికి పనికిరాదు అంటూ మోసపూరితమైన నివేదికలు కేంద్రానికి పంపి ప్రాజెక్టులు అనుమతులు పొందాలని ప్రయత్నం ఏదైతే చేస్తుందో అది రైతులకు ద్రోహం చేయడమే అన్నారు. రక్షించవలసిన ప్రభుత్వం మోసపూరితమైన నివేదికలు రైతులకు భయభ్రాంతులకు గురి చేసే ప్రకటనలు ఎలా చేస్తుంది అంటూ ఆశప్ప వాపోవడం జరిగింది. రైతులు తరతరాల నుండి భూమినే నమ్ముకుని తమ జీవనం కొనసాగిస్తుంటే వారికి మోసం చేయడం సరైనది కాదంటూ రాఘవరెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సమావేశంలో రైతుల ఐక్యత, గ్రామ గ్రామ సమావేశాలు, గ్రామంలో నిరసన కార్యక్రమాలు, రైతులకు జరుగుతున్న అన్యాయాల పైన జహీరాబాద్ కేంద్రంగా ఒక సమావేశం, హైదరాబాద్ కేంద్రంగా మరో సమావేశం, ఏర్పాటు చేస్తే నైనా రైతుల పట్ల జరుగుతున్న వివక్షతను ప్రభుత్వం కనువిప్పు కరుగుతుందని ఈ కార్యక్రమాలు గురించి చర్చించడం జరిగింది ఈ సమావేశంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.



