ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి

 

జహీరాబాద్ జులై 16( జనంసాక్షి).
జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్,సెక్యూరిటీ, కాంట్రాక్ట్ కార్మికులకు గత రెండు నెలలుగా జీతం రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే వేతనాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.మహిపాల్ కోరారు.శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ .శేషు కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మహిపాల్ మాట్లాడుతూ రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వేతనాలు ఇవ్వాలని కాంట్రాక్టర్ పై ఒత్తిడి తేవాలని కోరారు.
స్పందించిన సూపరింటెండెంట్ డాక్టర్ శేషు కాంట్రాక్టర్ తో మాట్లాడడంతో సోమవారం వరకు వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు బండి సుధాకర్, నాయకులు సుమలత, కృష్ణ, తరులు పాల్గొన్నారు.