ప్రభుత్వ కార్యక్రమాలపై సర్పంచుల సదస్సులు

విజయనగరం,నవంబర్‌16(జ‌నంసాక్షి): ఈ నెల 17,18 తేదీల్లో సర్పంచులతో డివిజను స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అమలు జరుగుతున్న ఓడీఎఫ్‌, సిమెంటు రహదారులు, అంగన్‌వాడీ భవనాలు, ఎల్‌ఇడీ దీపాలు, ఘనవ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలపై ఇందులో చర్చిస్తామని అన్నారు. 17తేదీన పార్వతీపురంలో గిరిమిత్ర భవనంలో పార్వతీపురం డివిజను సర్పంచులకు, 18న విజయనగరం డివిజను సర్పంచులకు కలెక్టరేట్‌ కార్యాలయంలో సదస్సులు జరుగుతాయని పేర్కొన్నారు. ఇదిలావుంటే ఓడీఎఫ్‌ గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలనిలబ్ధిదారులకు సూచించారు. డిసెంబరు నెలాఖరునాటికి అన్ని గ్రామాల్లో శతశాతం నిర్మాణాల పూర్తికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లలో నిర్మించిన మరుగుదొడ్లను వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రమంతా ఓడీఎఫ్‌ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారని చెప్పారు. కొన్నిచోట్ల ఇంకా చేపట్టని మరుగుదొడ్ల పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ గ్రామాన్ని జిల్లా కలెక్టర్‌ సందర్శిస్తారని మండల అధికారులంతా హాజరైనప్పటికీ చివర్లో ఆయన పర్యటన రద్దయింది.

తాజావార్తలు