ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది
మంచాల జడ్పీటీసీ నిత్యానిరంజన్ రెడ్డి
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్21(జనంసాక్షి):- ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు మంచాల మండల కేంద్రములో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు సామూహిక అక్షర అభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంచాల జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయివేటుకు దీటుగా విద్యాబోధన జరుగుతుందని, బడి బయట ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి అందరం కలిసి కట్టుగా కృషి చేయాలని తెలిపారు. ఉన్నత స్థానంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, ఎంఈవో వెంకట్ రెడ్డి ఎంపీడీవో శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ జెగన్ రెడ్డి, నాయకులు బాలరాజు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుగంధ, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.