ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

– వీరన్నపేట సర్పంచ్ కొండపాక భిక్షపతి
కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన సర్పంచ్
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 08: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు నాణ్యమైన విద్య అందుతుందని వీరన్నపేట గ్రామ సర్పంచ్ కొండపాక బిక్షపతి పేర్కొన్నారు. సోమవారం చేర్యాల మండలంలోని వీరన్న పేట గ్రామంలో తమ కుమారుడు మణికాంత్ ను మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన వసతుల కల్పన, మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన సౌకర్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ విద్యను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.